తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విపరీతంగా కురుస్తున్న వర్షాలు ప్రజలను అనేకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. కనీసం ఎవ్వరూ రోజువారీ పనులను కూడా చేసుకోనివ్వకుండా నిర్విరామంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో రికార్డ్ వర్షపాతం నమోదు అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు వర్షాల గురించి అప్డేట్స్ ను అందిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను అప్రమత్తం చేస్తోంది. అందుకు తగిన విధంగా GHMC మేయర్ విజయలక్ష్మి చర్యలను తీసుకుంటూ ప్రజలకు సరైన సూచనలను అందిస్తూ ఉంది. ఇక తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ప్రభావం మూలంగా విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అన్న మంచి ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న రెండు రోజుల పాటుగా సెలవులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తుంది.
దీనితో విద్యార్థులు కాస్త ఉపశమనం పొంది ఉంటారు.. ఎందుకంటే కొన్ని చోట్ల స్కూల్స్ కు సరైన పైకప్పు లేకపోవడం మరియు కొన్ని చాలా పాత భవనాలు కావడం తో భయపడే అవకాశం ఇప్పుడు లేదు.