తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాను రాను పార్టీలో ప్రాబల్యం బాగా తగ్గిపోయింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి, కొత్తగా పార్టీలో చేరిన నేతకు పీసీసీ పగ్గాలు ఇవ్వడం మరియు ఇతరత్రా కారణాల వలన కొంతకాలం నుండి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో అంటీ అంటనట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ తెరవెనుకల ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి అధికార BRS లోకి వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారని దాదాపుగా కంఫర్మ్ అయింది. ఇందుకు నిదర్శనమే తనకు అత్యంత సన్నిహితుడు మరియు యాదాద్రి భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి BRS లో చేరడం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్ లను అడుగుతున్నారట.. కానీ కేసీఆర్ మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీట్ మరియు ఒక ఎంపీ సీటు ఇస్తానని మాటిచ్చారట.
అయితే సరైన సమయం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేసీఆర్ వెయిట్ చేయమని చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అధికారికంగా కాంగ్రెస్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి BRS లోకి జంప్ అవ్వనున్నారు.