ఏడాది ఆరంభంలో సంక్రాంతికి వచ్చిన అలా వైకుంఠపురములో సినిమా తో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుష్ అయిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ తర్వాత సినిమా అప్డేట్ కోసం అభిమానులు అందరూ ఎంతో నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు. అప్డేట్ రానేవచ్చింది అల్లుఅర్జున్ అభిమానులందరికీ బన్నీ సర్ప్రైజ్ ఇచ్చారు. సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తన 21వ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించారు.
అది కూడా అందరూ ఊహించినట్లుగా… త్రివిక్రమ్ లేదా సుకుమార్ తో కాదు… కొరటాల శివతో ప్రస్తుతం 21 సినిమా చేయనున్నట్లు ప్రకటించారు అల్లు అర్జున్. ఈ సినిమా పలు భాషల్లో రూపొందుతున్న ట్లు సమాచారం, 2022 లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సుకుమార్ పుష్ప మూవీ లో బన్నీ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాపై కూడా రోజురోజుకు అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఆ తర్వాత కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేసేందుకు అల్లుఅర్జున్ సిద్ధమైన విషయం తెలిసిందే.