టాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక మంధనా కు మంచి డిమాండ్ ఉంది. ఆమె అసలు హీరోయిన్ గా పనికొస్తుందా అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఆమెతో సినిమాలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆమె రెండు సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాల తర్వాత ఆమె క్రేజ్ భారీగా పెరిగింది అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. దీనితోనే ఇప్పుడు ఆమె రేటు కూడా భారీగా పెంచింది.
ఇప్పుడు ఆమెకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చింది. రణవీర్ సింగ్ చేసే ఒక హాట్ లవ్ స్టోరీ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు టాలీవుడ్ జనాలు చెప్తున్నారు. ఆమె కోసం ఇప్పటికే అక్కడి నిర్మాత ఒకరు వచ్చారని ఆమె రెండు కోట్లకు ఆ ఆఫర్ ని ఓకే చేసింది అంటున్నారు. త్వరలోనే ఆమెను ఆ సినిమాలో తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇక ఆమె ఈ సినిమా కోసం బికినీ వేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే దర్శకుడు ఆమెకు కథ కూడా వినిపించారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. బాలీవుడ్ సినిమా కోసం పాప తెలుగు సినిమాను వదులుకుంది అంటున్నారు. ఆమె ఈ ఏడాది మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, ఆ తర్వాత నితిన్ తో భీష్మ సినిమాలు చేసి మంచి ఊపు మీద ఉంది రష్మిక.