చైనాకు కేంద్రం బిగ్ షాక్ రెడీ…!

-

ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కేంద్ర సర్కార్ విజయవంతంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ దేశం కూడా లాక్ డౌన్ విషయంలో ఈ స్థాయిలో ఆలోచన చేయలేదు కూడా. అన్ని దేశాలు లాక్ డౌన్ ని ప్రకటించినా సరే… ఆర్ధిక పరిస్థితిని దృష్టి లో పెట్టుకుని కొన్ని మినహాయింపు లు ఇచ్చాయి. కాని మోడీ సర్కార్ మాత్రం మినహాయింపు లు ఇవ్వడానికి చాలా వరకు అందరితో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంది అనే విషయం అర్ధమవుతుంది.

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లాక్ డౌన్ ని అమలు చేసిన తర్వాత ఆర్ధిక ఇబ్బందులు అనేవి పెరిగిపోతున్నాయి. దీనికి తోడు యువత కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. కుటుంబాలకు వాళ్ళు భారం అయిపోయారు అనే విషయం అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు యువతను టార్గెట్ గా చేసుకుని కొన్ని కార్యక్రమాలకు కేంద్ర సర్కార్ సిద్దమవుతుంది.

చైనా ఉత్పత్తులను మన దేశంలో మాత్రమే తయారు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. చైనా లో తయారు చేసే చిన్న చిన్న వస్తువులు కూడా మన దేశంలో ఎక్కువగా అమ్ముడు అవుతూ ఉంటాయి. అందుకే ఆ వస్తువుల తయారీలో యువతకు శిక్షణ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాలను చెయ్యాలని యోచిస్తుంది. ఇయర్ ఫోన్స్, ఫోన్ పౌచ్ వంటివి చైనా నుంచి వస్తు ఉంటాయి. ఇలాంటివి అన్నీ ఇక మన దేశంలోనే తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారట…

Read more RELATED
Recommended to you

Latest news