సుప్రీంకోర్టులో అజారుద్దీన్ కు షాక్.. హెచ్ సిఏ ప్రెసిడెంట్ నుంచి దిగి పోవాల్సిందే !

-

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు ఊహించని షాక్ తగిలింది. హెచ్ సి ఏ ప్రెసిడెంట్ పదవి నుంచి అజారుద్దీన్ దిగి పోవాల్సిందే నని సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. హెచ్ సి ఏ  ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ను కొద్ది నెలల క్రితమే అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు అజారుద్దీన్. అంబుడ్స్ మెన్ దీపక్ వర్మ తో కలిసి… సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు అజారుద్దీన్. అయితే అజారుద్దీన్ వేసిన ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్ తరపు న్యాయవాది మరియు అజారుద్దీన్ తరపు న్యాయవాది వాదించిన వాదనలను విన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హెచ్ సి ఎ ప్రెసిడెంట్ పదవి నుంచి అజారుద్దీన్ తొలగిపోవాల్సిం దేనని పేర్కొన్న సుప్రీంకోర్టు… దీపక్ వర్మ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అపెక్స్ కౌన్సిల్ కు భారీ ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Latest news