పుట్టిన రోజునే బండి సంజయ్ కి షాక్ ఇచ్చిన అధికారులు

-

ఇవాళ  తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అయితే పుట్టినరోజు నాడే… అధ్యక్షుడు బండి సంజయ్ దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అసలు వివరాల్లోకి వెళితే..బండి సంజయ్ కుమార్ సొంత జిల్లాలో.. ఆయన పుట్టిన రోజు వేడుకలను.. బిజేపి పార్టీ కార్యకర్తలు, నాయకులు అభిమానులు చాలా బ్రహ్మాండంగా జరిపారు. ఫ్లెక్సీలు, డిజేలతో పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది.

కార్పొరేషన్ అధికారులకు – బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన కూడళ్లలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోనే ఈ వివాదం ఏర్పడింది. నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలను కట్టారని అధికారులు తొలగించారు. అయితే రంగంలోకి దిగిన బీజేపీ నాయకులు.. అధికారులను అడ్డుకోని వాగ్వాదానికి దిగారు. మా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు బీజేపీ శ్రేణులు. వివాదం పెద్దది కావడంతో.. పోలీసులు రంగం లోకి దిగారు. బిజేపి శ్రేణులకు సర్దిచెప్పి.. అక్కడి వివాదాన్ని సద్దుమనిగేలా చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version