అల్లుడి డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్.. అప్పుడే పెరిగిన అంచనాలు

-

భాషతో సంబంధం లేకుండా కొంత మంది నటులు అభిమానులను సంపాదించుకుంటారు. అలాంటి కోవలోకే వస్తారు.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా రజనీ కాంత్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ హడావుడి మామూలుగా ఉండదు. కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా రజనీకి వీరాభిమానులున్నారు. వీరందరూ సూపర్ స్టార్ సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరకు తలైవా రజనీ కాంత్ తన కెరీర్ లో 167 సినిమాలు పూర్తి చేశాడు. తాజాగా 168 వ సినిమా శివ దర్శకత్వంలో చేస్తున్నారు. అన్నాత్తే అనే టైటిల్ ను ఈ మూవీకి ఖరారు చేశారు. ఈ మూవీని దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇంత వరకు శివ తమిళంలో అనేక హిట్ సినిమాలు అందించాడు.

రజనీకాంత్ /Rajinikanth

అయితే అన్నాత్తే చివరి దశకు చేరుకోవడంతో ఈ సూపర్ స్టార్ తదుపరి చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తన తదుపరి చిత్రం గురించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. పి. వాసు దర్శకత్వంలో ఒకప్పటి హిట్ మూవీ చంద్రముఖి కి సీక్వెల్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. తన అల్లుడైన తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇటీవలే తమిళంలో పవర్ పాండి అనే సినిమా చేయగా.. అది బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తాను దర్శకుడిగా తదుపరి చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ తో నిర్మించనున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి రజనీ కుమార్తెలు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటారని టాక్. కోలీవుడ్ లో తెగ హల్చల్ చేస్తున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version