గోవా రాష్ట్రంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ కుమారుడు.. ఉత్పల్ పారికర్ బీజేపీకి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరబోనని ఉత్పల్ పారికర్ స్పష్టం చేశారు. వచ్చె నెలలో జరగబోయే అసెంబ్లి ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. గోవా రాష్ట్ర రాజధాని పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో బరిలో ఉంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కాగ గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీజేపీ గురువారం లీస్టు ను విడుదల చేసింది.
అయితే ఈ లీస్టు లో ఉత్పల్ పారికర్ పేరు లేదు. దీంతో ఉత్పల్ పారికర్ అసంతృప్తికి గురి అయ్యారు. దీంతో గురు వారం నుంచే ఉత్పల్ పారికర్ బీజేపీ కి గుడ్ బై చెబుతారని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఉత్పల్ పారికర్ కు బీజేపీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. ఉత్పల్ పారికర్ తమ పార్టీలోకి వస్తే.. తగిన ప్రాధాన్యత ఇస్తామని ట్విట్టర్ లో కూడా తెలిపారు. అయితే తాను స్వతంత్య్ర అభ్యర్థిగానే ఉంటానని ఉత్పల్ పారికర్ ప్రకటించారు.