కాంగ్రెస్ కు బిగ్ షాక్: మాజీ మంత్రి సీనియర్ లీడర్ రాజీనామా !

-

తెలంగాణాలో మరో మూడు వారాలలో ఎన్నికలలు జరగనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్నికల ప్రచారాల హడావుడి భారీగా ఉంది. ఇక సీట్లు రాలేదన్న కారణాలతో పార్టీలకు షాక్ ఇస్తూ నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ మంత్రి బోడ జనార్దన్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అధిష్టానికి భారీ షాక్ ఇచ్చాడని చెప్పాలి. తెలుస్తున్న సమాచారం ప్రకారం బోడ జనార్దన్ మొదటి నుండి చెన్నూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు, కానీ ఇతనికి ఆ టికెట్ దక్కకపోవడంతో ఇక ఈ పార్టీలో ఉండి లాభం లేదనుకుని రాజీనామా లేఖను కాంగ్రెస్ కు పంపించారు. అయితే ఇతనికి బదులుగా కాంగ్రెస్ ఆ టికెట్ ను కనీసం సభ్యత్వం కూడా లేని వివేక్ కు ఇచ్చారన్న కోపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.

బోడ జనార్దన్ కాంగ్రెస్ పై టికెట్ లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారంటూ కామెంట్ చేశారు. కాగా రేపు బోడ జనార్దన్ కేసీఆర్ సమక్షములో BRS లోకి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news