హీరో విశ్వక్‌సేన్‌ కు బిగ్‌ షాక్‌..HRC లో ఫిర్యాదు

-

టాలీవుడ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. తన సినిమా ప్రమోషన్స్‌ కోసం నిన్న విశ్వక్‌ సేన్‌ ఓ ఫ్రాంక్‌ వీడియో చేశారు. అయితే…వీడియో న్యూసెన్స్‌ ను క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే.. ప్రమోషన్స్ పేరిట ఈ ఫ్రాంక్ వీడియో న్యూసెన్స్ చేస్తున్న ఘటనపై స్పందించిన అడ్వొకేట్‌ అరుణ్‌ కుమార్…. హీరో విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేయనున్నారు.

పెట్రోల్‌ డబ్బాతో అభిమానిని సూసైడ్‌ చేసుకునేలా వ్యవహరించిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేయనున్నారు అడ్వకేట్ అరుణ్‌ కుమార్. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేయనున్నారు అరుణ్‌ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news