తెలంగాణ రైస్ మిల్లులపై ఎఫ్ సీ ఐ దాడులు

-

తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లుల పై ఎఫ్ సీ ఐ దాడులు చేసింది. రాష్ట్రంలో 3278 మిల్లుల 2020-21 వానాకాలం, యాసంగి నిల్వలపై దాడులు చేసింది. గతేడాది కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఎఫ్ సీ ఐకి  ఇవ్వాల్సి ఉన్నా.. గడువు ముగియడంతో తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ప్రత్యేక టీములతో 120 మంది అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఎఫ్ సీ ఐ అధికారులు. ఎఫ్ సీ ఐ అధికారులతో పాటు సివిల్ సప్లై అధికారులు ఈ డ్రైవ్ చేపట్టారు. ఇటీవల మార్చి, ఎప్రిల్ నెలల్లో నిర్వహించిన తనిఖీల్లొ రైస్ మిల్లుల్లో అవకతవకలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న సోదాలు రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ విషయంపై కీలక వ్యాఖ్యలను చేశారు. ఎఫ్ సీ ఐ అధికారులు చేసిన తనిఖీల్లో మిల్లుల్లో ధాన్యం తగ్గిందని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో త్వరలోనే ఎఫ్ సీఐ అధికారులు త్వరలోనే తనిఖీలు చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news