రచ్చ మొదలైంది : భీమ్లా నాయక్ నుంచి బిగ్ అప్డేట్

సెప్టెంబర్‌ 2న పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది.. పవన్‌ బర్త్‌ డే అనగానే… ఆయన ఫ్యాన్స్‌ ఇప్పటి నుంచే రచ్చ మొదలు పెట్టారు. భారీ కటౌట్లు, ఫ్లెక్స్‌లతో హంగామా చేస్తున్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నారు. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో “బీమ్లానాయక్‌” పేరుతో రీమేక్‌ చేస్తున్నారు.

సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పునః ప్రారంభం అయింది. అయితే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లిమ్స్‌ విడుదల కాగా… సెప్టెంబర్‌ 2 న పవన్‌ బర్త్‌ డే ఉన్న నేపథ్యం లో చిత్ర యూనిట్‌ ఓ సర్‌ ప్రైజ్‌ ప్లాన్‌ చేసింది. బీమ్లా నాయక్‌ మూవీ టైటిల్‌ సాంగ్‌ ను సెప్టెంబర్‌ 2 న ఉదయం 11.16 కు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు ను పవర్‌ ఫుల్‌ సాంగ్‌ తో సెలబ్రేట్‌ చేసుకుందామని చిత్ర బృందం పేర్కొంది.