బిగ్ అప్డేట్: ప్రభాస్ “సలార్” టీజర్ అనౌన్స్మెంట్…

-

కెజిఎఫ్ చాప్టర్ 1 మరియు 2 ల అనంతరం డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ కు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా ఆఫర్ లు కూడా భారీగానే వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “సలార్”. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నుండి వచ్చే ఒక్కో అప్డేట్ అభిమానులను మరింత ఆసక్తిని రేపుతోంది. తెలుస్తున్న సమాచారం మరొక అప్డేట్ ఈ సినిమా నుండి విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసిందట. ఈ సినిమా టీజర్ ను జులై 6వ తేదీ ఉదయం 5 .12 గంటలకు విడుదల చేయడానికి ముహూర్తం పెట్టారు. ఈ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పక్కా మాస్ లుక్ లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

కాగా ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా జగపతిబాబు మరో అద్భుతమైన పాత్రను చేస్తున్నారు. మరి టీజర్ ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకో మూడు రోజులు వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version