కాజల్ కు మిడిల్ ఫింగర్ చూపించిన లోబో… అది కట్ చేస్తా అన్న ప్రియా..!

-

బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే ఇంటినుండి నలుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లారు. ఇక తాజాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో కాజల్ కాస్త ఓవరాక్షన్ చేయడంతో లోబో దారుణమైన సింబల్ చూపించాడు. కాజల్ యాంకర్ రవి, లోబో లకు కోపం వచ్చేలా మాట్లాడింది. ఇప్పటి వరకు ఇద్దరు కిచన్ టీంలో పని చేయలేదని బాత్రూం కి పరిమితమయ్యారని వ్యాఖ్యానించింది. ఇప్పుడు బాత్ రూమ్ నుండి కిచన్ కు వచ్చారని మాట్లాడింది. దాంతో యాంకర్ రవి మండిపడ్డాడు.

కాజల్ మాటలు అసలు ఇప్పటివరకు పని చేయలేదు అన్న విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే సమయంలో లోబో మిడిల్ ఫింగర్ పైకి చూపిస్తూ కనిపించాడు. అది కాస్త కాజల్ కంటపడింది. వెంటనే కాజల్ అలా చేయొద్దు లోబో అని చెప్పింది. దాంతో ఇప్పుడు నేను ఏమన్నా లోబో ప్రశ్నించగా….ఏం అనలేదు చేశావ్..మిడిల్ ఫింగర్ పై చూపించావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలంటే రిక్వెస్ట్ చేసి వీడియో వేయిస్తా అని చెప్పింది. దాంతో నేను చూపుడు వేలును చూపించా అంటూ లోబో కవర్ చేశాడు. కాని లోగో చూపించడం కనిపించింది దాంతో కాజల్ రిప్లై ఇవ్వమని అడగాలా అంటూ చెప్పింది. నేను చూపించలేదు జాన్ అంటు లోబో చెప్పుకొచ్చాడు.

ఆ తరవాత లోబో తనకు మిడిల్ ఫింగర్ చూపించాడని కాజల్ ప్రియా కు చెప్పగా నేను అయితే కట్ చేసేదాన్ని అంటూ ప్రియా కోప్పడింది. బిగ్ బాస్ హౌస్ లో హింసకు చోటు లేదని అందుకే ఊరుకుంటున్నా అని కాజల్ పేర్కొంది. ఇక చివరికి లోబో తను మిడిల్ ఫింగర్ చూపించలేదని అయినప్పటికీ అలా అనిపించినందుకు క్షమాపణలు చెబుతున్నానని కాజల్ కు వెళ్లి స్వారీ చెప్పాడు. దాంతో గొడవ సద్దుమణిగింది. మరి రేపటి ఎపిసోడ్ లో అయినా కాజల్… రవి, లోబో లతో కలిసిపోతారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news