ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలం. అయితే ఈ రోజు ఆరోగ్యంగా ఉండడానికి, ఫిట్ గా ఉండడానికి కొన్ని పద్ధతుల గురించి నిపుణులు మనతో షేర్ చేసుకోవడం జరిగింది. వీటి ద్వారా చక్కటి ప్రయోజనాలను మీరు పొందవచ్చు. వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
అందుకనే ఉదయం అల్పాహారం సమయంలో వాల్ నట్స్ ను తీసుకోవడం చాలా ముఖ్యం. వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ మరియు ఇతర పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, మెదడుని పదును పెట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అయితే వాల్ నట్స్ ను ఎలా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇలా కనుక మీరు తీసుకున్నారంటే ఫిట్ గా ఉండడానికి వీలవుతుంది. అలానే ఆరోగ్యంగా కూడా.
వాల్ నట్స్ మరియు పెరుగు:
దీని కోసం మీరు 4 నుండి 5 వాల్ నట్స్ ని రాత్రి నీళ్ళల్లో నానపెట్టాలి. ఆ తర్వాత ఉదయాన్నే ఒక కప్పు పెరుగు లో వీటిని కలిపి తీసుకోండి. మీరు కావాలంటే ఇందులో ఓట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పోషకపదార్థాలు మీకు అందుతాయి.
సాయంత్రం స్నాక్స్ కింద:
సాయంత్రం పూట ఆకలేస్తుంది కదా అటువంటి సమయంలో జంక్ ఫుడ్ కి బదులుగా మీరు వాల్ నట్స్ ని తీసుకోవచ్చు. దీనిలో వుండే ప్రోటీన్ మరియు ఫైబర్ మీకు చాలా మేలు చేస్తుంది.
స్మూతీస్:
ఇలా కూడా చేసుకుని ప్రతి రోజూ తీసుకోవచ్చు. ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. అలానే సలాడ్స్ లో ముక్కలు కింద కట్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కనుక మీరు వీటిని తీసుకున్నారంటే ఖచ్చితంగా ఫిట్ గా ఉండడానికి వీలవుతుంది. అలానే ఆరోగ్యంగా కూడా ఉంటారు. కాబట్టి రెగ్యులర్ గా ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఫిట్ గా ఉండండి.