BIGG BOSS-5 : టాస్క్ మధ్యలో కుప్ప కూలిన లోబో..!

-

బిగ్ బాస్ సీజన్ -5 ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. అయితే మొదటి నుండి కాంటెస్టెంట్ లు మాత్రం గొడవలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరిని కదిలించినా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇక ఈ సీజన్ లో ఇప్పటికే బిగ్ బాస్ టాస్క్ లు ఇవ్వటం కూడా ప్రారంభించాడు. ఇంటిసభ్యులకు టాస్క్ లు ఇవ్వటం అంటే గొడవలు సృష్టించడం…కలిసి ఉన్నవాళ్ళని విడిపోయేలా చేయడమే. అలాగే నిన్నటి బిగ్ బాస్ సీజన్ లో కూడా ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక టాస్క్ ఆడుతూ లోబో కుప్ప కోలిపోయాడు. దాంతో వెంటనే అతడిని బిగ్ బాస్ మెడికల్ రూం కు పిలిపించాడు. లోబో నడవలేని పరిస్థితిలో ఉండటం తో ఇంటి సభ్యులు కంగారు పడిపోయారు. కానీ కొద్ది నిమిషాల్లోనే లోబో కోలుకుని బయటకు వచ్చాడు. వచ్చాక సిగరెట్ లు మానేయాలని యాంకర్ రవి కోరగా ఇప్పటి నుండి అసలు తాగనని చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news