Bigg Boss Telugu 5: ఆనీ విశ్వరూపం.. సిరి,జెస్సీల‌కు షాకిచ్చిన కెప్టెన్ షన్ను.. అసలు ఏమైందంటే..!

-

Bigg Boss Telugu 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నబిగ్గెస్ట్ రియాల్టీ షో. వారం మొత్తం స్నేహితుల ఉండే కంటెస్టెంట్లు .. నామినేష‌న్లు, కెప్టెన్సీ టాస్కులు పెట్టగానే బ‌ద్ద శ‌త్రువులుగా మారుతున్నారు. ఈ క్ర‌మంలోనే కంటెస్టెంట్ల అంద‌రూ గ్రూపులు క‌ట్టారు. సొంతంగా ఆడాలని బిగ్ బాస్ పదే పదే చెప్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ప్లాన్ లో కొంత‌మంది స‌క్సెస్ అవుతుంటే..మరికొంద‌రూ మాత్రం బొక్క బోర్లా ప‌డుతున్నారు. వ్య‌క్తిగ‌తంగా ఆడ‌టం కన్న‌ కలిసికట్టుగా ఆడితే.. ప్రేక్షకులు కూడా మద్దతు ఇవ్వడానికి ఆలోచిస్తారు.

ఇలా ప్రతి టాస్క్‌లో సన్నీ, మానస్, కాజల్ కలిసి ఆడుతుండ‌టం చూస్తునే ఉన్నాం. అస‌లు ఈ సీజ‌న్లో గ్రూపులు క‌ట్ట‌డం మొద‌ట‌గా ప్రారంభించి ష‌న్ను, సిరి, జెస్సీలే.. వీరికి త్రిమూర్తులు అని పేరు కుడా పెట్టేశారు. ప్ర‌తి వారం లాగేనే ఈ వారం కూడా గ్రూపులు కట్టి ఆడుతున్నారు. ప్ర‌ధానం ఈ గ్రూపుల ఘ‌ర్ష‌ణ
కెప్టెన్సీ టాస్క్ లో కొట్టోచ్చిన‌ట్టు క‌నిపించింది. నిన్న ఎపిసోడ్ ఎలా జ‌రిగిందో.. చూద్దాం..

గురువారం జ‌రిగిన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. ‘వెంటాడు- వేటాడు’ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్కులోభాగంగా థర్మాకోల్‌ బ్యాగులు వేసుకుని కెప్టెన్సీ టాస్క్ కంటెస్టెంట్స్ సర్కిల్ గా ఉన్నా.. ట్రాక్‌పై నడవాల్సి ఉంటుంది. సర్కిల్ బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు ఔట్ అయిపోయిన‌ట్టు. ఈ టాస్కులో శ్రీరామ్‌, సన్నీ, షణ్ను, సిరి, యానీ, మానస్‌ పోటీపడ్డారు.

తొలి రౌండులో శ్రీరామ్, స‌న్నీ పోటిప‌డ్డారు. ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఒక‌రిపై ఒక‌రూ వాగ్బాణాలు సంధించుకున్నారు. ఈ క్ర‌మంలో శ్రీ‌రామ్ స‌న్నీని రెచ్చ‌గొట్టారు. ‘సన్నీ ఇండిపెండెంట్‌ ప్లేయర్ అనుకున్నా.. నువ్ ఓడిపోయావ్‌, అందుకే బయట ప‌డ్డావ్.. అంటూ రెచ్చ‌గొట్టాడు. ఫ్లైయింగ్ ఇస్తూ.. గొంతు అదుపులో పెట్టుకో అంటూ.. స‌న్నీకి వార్నింగ్‌ ఇచ్చాడు శ్రీరామ్‌.

ఆ త‌రువాత రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్ పోటీ ప‌డ్డారు. మాన‌స్ ను శ్రీ రామ్ కింద‌ప‌డేయ‌టంతో అవుట్ అని ప్ర‌క‌టించారు సంచాల‌కుడు జెస్సీ. కానీ స‌న్నీ మాత్రం ఏలా అవుట్ అని ప్ర‌క‌టిస్తార‌ని.. మానస్‌ అవుట్‌ కాదంటూ వాదించాడు. తర్వాతి రౌండ్‌లో మిగిలిన‌ ముగ్గురు కంటెస్టెంట్లు షణ్ను, సిరి యానీని ఆడారు. ఈ రౌండ్లో ఆనీ మాస్ట‌ర్ ను షన్ను, సిరిలు క‌లిసి టార్గెట్‌ చేశారు.

దీంతో ఆనీ మాస్ట‌ర్.. కోపంతో బయటికి వచ్చేసింది. ఇక్కడ ఎవరు సొంతంగా ఆడటం లేదు అంటూ ఇంటి సభ్యులపై చిందులు తొక్కింది. ఈ క్ర‌మంలో సిరిని నెట్టివేసింది. దీంతో సిరి ఏకంగా కత్తి చేతిలో పట్టుక వ‌చ్చింది. సిరి ప్ర‌వ‌ర్త‌న‌తో కంటెస్టెంట్ల అంద‌రూ షాక‌య్యారు. సిరి చేసేది తప్పంటూ వారించడంతో ఆమె చాకు కిందపడేసింది. అయితే ఇంట్లో ఉన్నంత వ‌ర‌కు తాను కెప్టెన్‌ అవ్వను అంటూ ఏడ్చేసింది.

ఇక, చివరి రౌండ్‌లో సిరిపై షణ్ముఖ్‌ విజయం సాధించి కెప్టెన్‌గా అవతరించాడు. కెప్టెన్ అయిన అనంత‌రం .. ష‌న్ను సంచ‌ల‌న నిర్ణ‌యాలుతీసుకున్నారు. షణ్ముఖ్ జస్వంత్ కెప్టెన్ అయిన తర్వాత సిరి, జెస్సిలలో ఎవరో ఒకరు రేషన్ మేనేజర్ అవుతారని అంద‌రూ భావించారు. కానీఎవరూ ఊహించని విధంగా ఆనీ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచాడు.

ఈ నిర్ణ‌యంతో సిరి బాగా హర్ట్ అయింది. తనను కాకుండా మరొకరిని రేషన్ మేనేజర్‌గా తీసుకోవడంపై సిరి అలిగినట్లు తెలుస్తుంది. అయితే తన గేమ్ తాను ఆడుతున్న షణ్ణు.. ఈ విషయంలో మాత్రం సిరిని అస్సలు ఏ మాత్రం లెక్క చేయ‌లేద‌ని ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version