బిగ్ బాస్ 7: నాగార్జున ఫుల్ క్లాస్ … ఫ్యూజులు ఎగిరిపోతాయి వారిద్దరికీ !

-

ఈ రోజు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున రానున్న విషయం తెలిసిందే.. ఇంతవరకు బిగ్ బాస్ సీజన్ లో ఎన్నడూ లేనంత గందరగోళ వాతావరణం ఈ ఒక్క వారం రోజుల్లో జరిగింది అని చెప్పాలి.. ముఖ్యంగా ప్రిన్స్ మరియు గౌతమ్ ల మధ్యన గత రాత్రి జరిగిన గొడవ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. అందుకే చాలా మంది ఈ బిగ్ బాస్ జరగడం మంచిది కాదని కామెంట్ లు చేస్తున్నారు. ఇక వీరిద్దరూ తాము ఎక్కడ ఉన్నాము అన్నది కూడా మరిచిపోయి అరుచుకున్న తీరు అయితే చాలా బాదాకరం. ఈ రోజు ఎపిసోడ్ లో ఖచ్చితంగా వీరిద్దరికీ నాగార్జున గట్టిగా క్లాస్ పీకుతాడని తెలుస్తోంది. ఇక ప్రిన్స్ అయితే అనవసరం అయినా విషయాన్ని పెద్దది చేసి గొడవకు కారణం అయ్యాడు, పైగా తన యాటిట్యూడ్ మరియు బావుడ్ లాంగ్వేజ్ తో ప్రేక్షకులు ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యేలా వ్యవహరించాడు.

ఇంతకీ నాగార్జున ఏ విధంగా వీరిని మందలించి.. ఇకపై ఇలా ప్రవర్తించకుండా ఉండేలా బుద్ది చెబుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news