ఇంగ్లాండ్ పర్యటనను నిన్న ముగించుకున్న న్యూజిలాండ్ టీం స్వదేశానికి పయనం అయింది.. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తుండగా రూట్ క్యాచ్ ను తీసుకోబోయి బొటనవేలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడే అతను తన పరిస్థితిని జట్టు యాజమాన్యానికి తెలియచేసి వెంటనే ఫీల్డింగ్ లో నుండి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయాడు. అనంతరం స్కానింగ్ చేయగా, రిపోర్ట్స్ లో అతని బొటనవేలు డిజ్ లొకేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక రానున్న వన్ డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తన మొదటి మ్యాచ్ ను ఆడడానికి ఇంకా 20 రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పుడు జట్టుకు తలనొప్పిగా మారనుంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లో సౌథీ రికవర్ అయ్యి జట్టుతో చేరుతాడా ?
ఒక సీనియర్ బౌలర్ల వరల్డ్ కప్ లాంటి లీగ్ కు దూరమైతే ఫలితం ఎలా ఉండనుంది అన్న విషయాలు తెలియాలంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి.