బిగ్ బాస్: హోస్ట్ గా నాగార్జున వేస్ట్.. RGV సూపర్.. గీతూ షాకింగ్ కామెంట్స్..!

-

తాజాగా గీతూ నాగార్జున హోస్టింగ్ పై పెద్ద బాంబు పేల్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో కంత్రి గేమ్ లకు పెట్టింది పేరు గీతూ… స్ట్రాటజీ గేమ్ ప్లాన్ .. అది ఇది అంటూ ఇంటి సభ్యుల పరువు తీయడంలో ఈమె ఎప్పుడు ముందే ఉంటుంది. ఇక హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక రూల్ అయితే గీతూ కి మాత్రం మరో రూల్ అంటూ రూలింగ్ చేస్తోంది. సీజన్ మొదలైన దగ్గర్నుంచి ఇప్పటివరకు ఆమె ఆడిందే ఆట .. పాడిందే పాట.. ప్రతి ప్రోమోలో కూడా ఆమె హౌస్ లో ఉన్న 60 కెమెరాల ముందు ఆమె కనిపిస్తూ ఉంటుంది. నాగార్జున కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు.

కారణం లేకుండానే కామన్ మ్యాన్ ఆదిరెడ్డిని ఏం పీకావ్ అంటారు కానీ గీతూని మాత్రం ఎన్ని గబ్బు పనులు చేసినా.. ఆమెను చిన్న మాట కూడా అనరు. బిగ్ బాస్ అంటేనే గబ్బు గేమ్.. ఇలాంటి గబ్బు గేమ్ ముందుకు సాగాలి అంటే గబ్బు కంటెంట్స్ ఉండాలి.. అందుకే గీతూనే లాక్కొస్తున్నారు అంటూ కామెంట్లు కూడా వెలబడుతున్నాయి. ఇకపోతే బిగ్ బాస్ కి వెళ్లకముందు బిగ్ బాస్ రివ్యూలు చెప్పేది గీతూ. ఎంతలా అంటే షణ్ముఖ , సిరి ల రొమాన్స్ గురించి ఒక రేంజ్ లో ఏకిపారేసిన ఈమె ప్రస్తుతం బెస్ట్ పెర్ఫార్మర్ సిరి అంటూ చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు అప్పట్లో బిగ్ బాస్ హొస్ట్ నాగార్జున పై కూడా రివ్యూ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇక అందులో నాగార్జున హోస్ట్ గా వేస్ట్ అని తేల్చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. గీతు ఆ వీడియోలో ఏమన్నదంటే.. బిగ్ బాస్ కి హోస్టుగా చేసిన వాళ్లందర్లోనూ నాని ఈస్ బెస్ట్. ఇరగదీసాడు.. ఎన్టీఆర్ బాగా చేశారని అంటారు కానీ నేను చూసినంతవరకు నాకు నాని బెస్ట్ అనిపించింది. నాగార్జున గారు సాఫ్ట్ గా కనిపిస్తారు. బిగ్ బాస్ అంటేనే రోస్ట్ కానీ నాగార్జున అది చేయలేకపోతున్నాడు. ఇక ఎంత పెద్ద తప్పు చేసినా సరే నవ్వుతూ మాట్లాడతారు. అది నాకు నచ్చలేదు. నాగార్జున కాకుండా బిగ్ బాస్ షో లో హోస్ట్ గా వేస్ట్ అని చెప్పేసింది. ఇక బెస్ట్ హోస్ట్ ఎవరంటే నానినే అని చెబుతాను అని, రాంగోపాల్ వర్మ వస్తే ఇంకా బాగుంటుంది అంటూ కామెంట్లు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news