ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేక బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తోంది – బాల్క సుమన్

-

ప్రజా క్షేత్రంలోకి వెళ్లలేక బిజెపి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నల్లగొండ జిల్లా చండూరులో మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ..బూర నర్సయ్య గౌడ్ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలను టిఆర్ఎస్ పార్టి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

బూర నర్సయ్య గౌడ్ కు అన్ని రకాలుగా అవకాశాలు పార్టీ కల్పించిందని… పూర్తి స్థాయిలో సహకరించిందన్నారు. తరుణ్ చుగ్ అప్పాయింట్ మెంట్ కూడా బూర నర్సయ్య గౌడ్ కు దక్కలేదని ఎద్దేవా చేశారు. ఆత్మాభిమానం గురుంచి మాట్లాడే బూర ఎప్పుడేం మాట్లాడుతారని ప్రశ్నించారు. 2014, 18లో రెండూ సార్లు టిఆర్ఎస్ పార్టీ బూర నర్సయ్యకి అవకాశం కల్పించిందన్నారు.

కేసిఆర్, టిఆర్ఎస్ ఎన్నో అవకాశాలు కల్పించినా బూర నర్సయ్య వినియోగించుకోలేదన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టిఆర్ఎస్ పార్టీదన్నారు. పద్మశాలి, గౌడ్, ఇతర కుల వృత్తులకు ప్రాధాన్యత గౌరవం దక్కింది టిఆర్ఎస్ పాలనలోనేనని స్పష్టం చేశారు. బూర నర్సయ్య గౌడ్ లేఖలో పేర్కొన్న అంశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీని విమర్శించే హక్కు బూర నర్సయ్యకు లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news