బిగ్ బాస్: ఈవారం ఎలిమినేషన్ లో కొత్త ట్విస్ట్..!

-

బిగ్ బాస్ ఆరవ సీజన్ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 69వ ఎపిసోడ్ ను జరుపుకుంటుంది. హౌస్ నుంచి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ ఉండడం గమనార్హం . ఇప్పటికే 9 వారాలకు 9 మంది ఎలిమినేట్ కాగా.. ఈ పదో వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్ లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళల్లో ఒకరు.. గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్న మరొకరు ఈసారి ఎలిమినేషన్ తో హౌస్ నుంచి వీడనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన తొమ్మిది ఎలిమినేషన్ లో 9 మంది బిగ్ బాస్ హౌస్ ను వీడి తమ ఇంటికి చేరుకున్నారు.

ఈ తొమ్మిది మందిలో ముందుగా షానీ సల్మాన్, అభినయశ్రీ, నేహా చౌదరి , ఆరోహీ రావ్, చంటి, సుదీప, అర్జున్ , సూర్య, గీతూ వెళ్లిపోయారు. 9వ వారం గీతు ఎలిమినేట్ అయిన తర్వాత బిగ్బాస్ 6సీజన్లోని పదో వారం నామినేషన్ల ప్రక్రియ రసవత్తరంగానే సాగింది. పదో వారం నామినేషన్ లో మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో భాగంగానే ఇనయా సుల్తానా, కీర్తి భట్, వాసంతి, ఫైమా, రేవంత్ , ఆదిరెడ్డి, బాలాదిత్య, మెరీనా , అబ్రహం , శ్రీహాన్.. మరి కెప్టెన్ అయిన కారణంగా శ్రీ సత్య తో పాటు రాజశేఖర్, రోహిత్ ను కూడా ఎవరు నామినేట్ చేయలేదు.దీంతో వీరు ముగ్గురు సేఫ్ అయ్యారు.

అయితే బిగ్ బాస్ తెలుగు సిక్స్ సీజన్లో 10వ వారం డబుల్ ఎలిమినేషన్ తో షాక్ ఇవ్వనన్నాడు బిగ్ బాస్. దీంతో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయానికి వస్తే.. మంచి బిహేవియర్ కలిగిన కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే హౌస్ లో గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న వాసంతి కృష్ణన్ కూడా ఎలిమినేట్ అయి బయటకు వెళ్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇద్దరు మంచి కంటెస్టెంట్లు వెళ్లిపోవడంతో మిగతా కంటెస్టెంట్ లో నిరాశ చాయలు అలుముకున్నాయనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news