Bigg Boss 5: బిగ్ బాస్ ‘బిగ్’ స‌ర్‌ప్రైజ్‌! స్టేజ్‌పై మెరువ‌నున్న ‘టాలీవుడ్, హలీవుడ్ స్టార్స్‌’

-

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 చాలా రసావత్త‌రంగా కొన‌సాగుతుంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్ లో గొడవలు, ఏడుపులు, అల్లర్లు, గొడవలతో కంటెస్టెంట్స్ నానా హంగమా చేస్తున్నారు. మ‌రోవైపు.. షోలో కాంట్రవర్సీ, రొమాన్స్, ఫైట్స్ మోతాదుకు మించిపోయాయి. హౌస్‌లో జోష్‌ను నింపడానికి స‌ర్‌ప్రైజ్‌గా నాగ్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్‌, నితిన్‌, త‌మ‌న్నా, న‌భా న‌టేష్ ల‌ను స్టేజ్‌పై ర‌ప్పించారు. అటు కంటెస్టెంట్ల‌లోనూ, ప్రేక్ష‌కుల్లో ఆనందాన్ని డ‌బుల్‌ చేశారు బిగ్ బాస్‌.

మ‌రోసారి కంటెస్టెంట్ల‌కు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డానికి బిగ్ బాస్‌ రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ని స్టేజ్‌పైకి పిలువ‌నున్న‌రంట‌. నెక్స్‌ వీకెండ్ ఎపిసోడ్ లో కింగ్ నాగ్ తో పాటు అమీర్ ఖాన్ కూడా స్టేజ్‌ని షేర్ చేసుకోనున్నట్లు స‌మాచారం. అంతేకాకుండా వీరితో పాటు అక్కినేని హీరో నాగ చైత‌న్య కూడా స్టేజ్‌పై అల‌రించ‌నున్నర‌ని తెలుస్తుంది.

ఇటీవ‌ల.. చైతూ న‌టించిన‌ లవ్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా అమీర్ ఖాన్(amir khan) వ‌చ్చిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్ ను బిగ్ బాస్ షోకి గెస్ట్ గా పిలిచారట నిర్వ‌హ‌కులు. దానికి అమీర్ ఖాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో .. ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిన‌ట్టు తెలుస్తుంది. కానీ, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సింది. మ‌రో విశేష‌మేమంటే.. అమీర్ లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారు. బిగ్ బాస్ స్టేజ్ మీద‌ ఈ సినిమా ప్రమోష‌న్ చేసి ఉంటార‌ని ఊహ‌గానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇలాఉంటే.. ఇండస్ట్రీలో మ‌రో టాక్ వినిపిస్తుంది. బిగ్ బాస్ షోకి ఆశించిన మేర టీఆర్పీ ద‌క్క‌డం లేదని తెలుస్తుంది. ఓ వైపు.. ఐపీఎల్ ప్రారంభ‌కావ‌డం, మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ షో ఎవరు మీలో కోటీశ్వరులు షోలు బిగ్ బాస్ కి గ‌ట్టిపోటీ ఇస్తున్న‌టు తెలుస్తుంది. వీకెండ్స్ లో సైతం అనుకున్నంత రేంజ్‌లో టీఆర్‌పీ రావ‌డం లేదంట‌. ఒక‌వేళ అమీర్ బిగ్ బాస్ స్టేజ్ క‌నిపిస్తే.. షోకి అడ్వాంటేజ్ అవుతుంద‌ని, ఈ ప‌ని చేసిన‌ట్టు నిర్వ‌హ‌కులు ఈ ప‌ని చేసిన‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news