తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. భూముల రిజిస్ట్రేషన్, పట్టాలు మరియు ఇతర సమస్యల నేపథ్యంలో… ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చింది కేసీఆర్ సర్కార్. అయితే ఈ ధరణి పోర్టల్ వచ్చినప్పటి నుంచి… విపక్షాల నుంచి మరియు ప్రజల నుంచి… అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ధరణి రికార్డుల్లో తక్కువగా పడిన యజమాని పేరు ను సరిచేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆప్షన్ ను తీసుకు వచ్చింది. కొన్నిచోట్ల యజమాని పేరుకు బదులు ఇల్లు మరియు ఇంటి స్థలం అని నమోదయింది. ఇలాంటి వాటిని సరిచేసుకునేందుకు పట్టాదారు, భూమి వివరాలు, పాత పాస్ బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు, భూమి ఫోటో మరియు వీడియోను దరఖాస్తులో చేర్చాల్సి ఉంటుంది. నేరుగా ధరణి సైట్ లేదా మీ-సేవ కేంద్రానికి వెళ్లి పేరు సరిచేసుకోవచ్చు. ఇక ఈ కొత్త ఆప్షన్ తో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది అని అధికారులు చెబుతున్నారు.