బిగ్ బాస్ 7: అమర్ దీప్ ఎన్ని రోజులు మాటలు చెబుతావ్.. ఆటాడు !

-

బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా ప్రస్తుతం హౌస్ లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు కిరణ్ రాథోడ్, షకీలా, దామిని మరియు రతికా రాజ్ లు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయినా వారందరూ కూడా ఆట సరిగా ఆడని వారే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇంటిలో ఉన్న వారిలో సీరియల్స్ ద్వారా అందరికీ సుపరిచితుడు అయిన అమర్ దీప్ మొదటి రోజు నుండి ఆట మీద శ్రద్ధ పెట్టడంలో పూర్తిగా విఫలం అవుతూ వచ్చాడు. ఆడు అని ఇంటి సభ్యులు ఎవరైనా అంటే సరైన అవకాశం రాలేదంటాడు.. తీరా బిగ్ బాస్ అవకాశం ఇస్తే చెత్త చెత్త కారణాలు చెప్పుకుంటూ ఎస్కేప్ అవుతాడు. రోజు రోజుకి ఆట చాలా టఫ్ గా మారుతున్న తరుణంలో ఇక మీదట హౌస్ లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఆట ఆడి తానేమిటో అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతసేపు అమర్ దీప్ మాటలతోనే ,సినిమాటిక్ డైలాగులతోనే కాలయాపన చేస్తూ వచ్చాడు.

ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా నామినేషన్ లో అమర్ దీప్ ఉన్నాడు.. మరి ఈవారమయినా సరిగా ఆడి ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news