తెలంగాణలో టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కానీ

-

తెలంగాణలోని టీచర్ల బదిలీలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం రిలీజ్‌ చేసింది. రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్‌ అర్హత కేసులు, పదోన్నతులపై స్టేలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.

Telangana government approves transfers and promotions of teachers

మల్టీజోన్‌ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (SGT), మల్టీజోన్‌ -2 పరిధిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (SGT) టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మంగళ, బుధవారాల్లో అప్పీళ్లు, ర్యాంకుల దిద్దుబాటు, ఖాళీల సవరణల అప్‌డేట్‌కు అధికారులు అవకాశం కల్పించగా.. ఈ నెల 5న తుది సీనియారిటీ జాబితా ప్రకటించనున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. 8న వెబ్‌ ఆప్షన్ల సైతం ఎడిట్‌ చేసుకునే వీలు కల్పించింది. వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్‌ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news