Bigg Boss Sohel : సోహైల్ ఇంట విషాదం.. అనారోగ్యంతో తల్లి కన్నుమూత

-

తెలుగు సినీ నటుడు, హీరో సోహైల్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. కొత్త బంగారులోకం మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సోహైల్.  బిగ్ బాస్ తెలుగు షో  ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక సోహైల్ తల్లి ఫైమాసుల్తానా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మెడికోవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్ను మూసినట్లు తెలుస్తోంది. సోహైల్ కరీంనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు తండ్రి సయ్యద్ సలీం, తల్లి, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. సోహైల్ తల్లి ఫైమాసుల్తానా గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితొో బాధపడుతున్నట్టు సమాచారం. డయాలసిస్ నిమిత్తం మెడికోవర్ హాస్పిటల్ లో జాయిన్ అయింది. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో కన్ను మూసినట్టు సమాచారం.  దీంతో సోహైల్ శోకసంద్రంలో మునిగిపోయాడు. ఈ విషయం తెలిసిన కొందరూ అక్కడికి చేరుకొని సోహైల్ ను ఓదార్చారు. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని స్వస్థలం కరీంనగర్ తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news