బిగ్ బాస్ సోహెల్ ఎమోషనల్ పోస్ట్..!

-

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. అలాగే సినిమాల్లోనూ చాన్సులు అందుకొని తమ టాలెంట్ తో స్టార్స్ మారి ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో సయ్యద్ సోహెల్ ఒకడు. బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఆట తీరుతో రన్నర్గా నిలిచాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. అలాగే సాంగ్స్లోనూ నటించి మెప్పించాడు. అయితే సోహెల్ గత ఏడాది ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అనే సినిమాతో ప్రైవేట్ ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత ఏ కొత్త మూవీ ప్రకటించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా. ఉంటూ పలు పోస్టులు పెట్టి ఫాలోవర్స్ను పెంచుకుంటున్నాడు.

తాజాగా, సోహెల్ ఇన్ స్టా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “నిన్ను నువ్వు నమ్ముకో. నీ జీవితాన్ని నీ కంట్రోల్లో ఉంచుకో. నిన్ను డిస్కరేజ్ చేసేవాళ్లని పట్టించుకోకు. నెగిటివ్ మనుషులను, థింగ్స్, అలవాట్లని విడిచిపెట్టు. ఆశను కోల్పోయి దేనిని వదులుకోకు. నీ కోసమే ఈ అందమైన ప్రపంచం వెయిట్ చేస్తోంది” అని రాసుకొచ్చాడు. అయితే ఈ పోస్ట్ చూసిన వారంతా తనను మోసం చేసిన వారిని ఉద్దేశించి చేశాడని అంటున్నారు. లేదా తన ఫ్రెండ్ అఖిల్ సార్థక్ తో గొడవలు జరుగుతున్నాయి అందుకే పెట్టాడని నెట్టింట పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news