హీటెక్కిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

-

ఢిల్లీ నగరం చాలా హీట్ ఎక్కింది. భానుడి ప్రతాపంతో భగ భగ మండిపోతోంది. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్ వేవ్ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ మంగేశ్ పూర్ లో బధవారం మధ్యాహ్నం రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. దేశ చరిత్రలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే.

మరోవైపు ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డు స్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగా వాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్ లో కూడా 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్ ఫీల్ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన కొద్ది సేపటికే మళ్లీ ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీలో చిరు జల్లులు కురిసాయి.

Read more RELATED
Recommended to you

Latest news