Bigg Boss Telugu 3 Episode 17: రోహిణీ, శివజ్యోతి, రాహుల్, రవిపై వ్యక్తిగతంగా తమన్నా అటాక్..!

-

ఆమె వ్యక్తిగతంగా ఇంటి సభ్యులను టార్గెట్ చేస్తూ దూషించడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఏంది రా బాబు ఈమె బాధ అంటున్నారు. ప్రేక్షకులకే కాదు.. ఇంటి సభ్యులకు కూడా ఈమె ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు. తట్టుకోలేకపోతున్నారు.

అయ్యో.. దేవుడా… ఏంది మాకీ బాధ. ఈ తమన్నా బాధ ఏంది. ఆమె ఏం మాట్లాడుతోంది. ఏం చేస్తోంది. ఎందుకిలా ప్రవర్తిస్తోంది… మొన్నటి వరకు రసవత్తరంగా మారిన బిగ్ బాస్ ఒకేసారి వేరే టర్న్ తీసుకోవడంతో బిగ్ బాస్ అభిమానులు షోను చూడకుండా టీవీని కట్టేస్తున్నారు. దానికి కారణం కేవలం తమన్నానే.

ఆమె వ్యక్తిగతంగా ఇంటి సభ్యులను టార్గెట్ చేస్తూ దూషించడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఏంది రా బాబు ఈమె బాధ అంటున్నారు. ప్రేక్షకులకే కాదు.. ఇంటి సభ్యులకు కూడా ఈమె ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు. తట్టుకోలేకపోతున్నారు.

ముందు.. హౌస్ లోకి రాగానే వరుణ్ ను టార్గెట్ చేసింది తమన్నా. ఇద్దరు కలిసి ఒకరోజు జైలులో ఉన్న తర్వాత వరుణ్ ను వదిలేసింది. తర్వాత అలీని టార్గెట్ చేసి.. ఆయన్ను ఇష్టమున్నట్టు దూషించింది. తర్వాత అలీని వదిలేసి… రవిని పట్టుకుంది. రవిని వరుసగా తిడుతూనే ఉంది. మొన్నటి ఎపిసోడ్ నుంచి నిన్నటి ఎపిసోడ్ మొత్తం రవిపై వ్యక్తిగతంగా దూషిస్తూనే ఉంది.

తినేటప్పుడు, తాగేటప్పుడు, ఎక్కడ పడితే అక్కడ రవిపై విమర్శలు చేసింది తమన్నా. మధ్యలో ఆమెను అడ్డుకోవడానికి వచ్చిన రోహిణీ, శివజ్యోతి, రాహుల్ పై కూడా విరుచుకుపడింది తమన్నా. దీంతో హౌస్ లో ఈమె గోలను చూడలేక ప్రేక్షకులకు చిరాకెత్తింది.

అయితే.. బిగ్ బాస్… శ్రీముఖి, రవిని పిలిచి… ఈసారి నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చెప్పాలంటూ కోరుతాడు. డైరెక్ట్ నామినేషన్స్ చేయడం వల్ల హౌస్ లో గొడవలు పెరిగిపోతున్నాయని వాళ్లు చెబుతారు. తమన్నా వ్యక్తిగతంగా దూషించడం కరెక్ట్ కాదని బిగ్ బాస్ కు వాళ్లు తెలియజేస్తారు.

కట్ చేస్తే… బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు. దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ ఇస్తాడు. తికమకపురం అనే గ్రామానికి చెందిన వాళ్లు ఇంటి సభ్యులు. ఇద్దరు సభ్యులు ఊరు పెద్దలు, ఇద్దరు సభ్యులు ఊరి జంట, ఇద్దరు పోలీసులు, ముగ్గురు దొంగలు.. ఇలా ఇంటి సభ్యులను డివైడ్ చేస్తాడు బిగ్ బాస్.

ముగ్గురు దొంగలు.. ఆ ఊళ్లో దొంగతనం చేయకుండా పోలీసులు చూసుకోవాలి. వాళ్లు ఎంత ఎక్కువ విలువైన వస్తువులను దొంగతనం చేస్తే వాళ్లే గెలుస్తారు. ఇది కెప్టెన్ ను డిసైడ్ చేసే టాస్క్ కాబట్టి.. అందరూ తమ పాత్రల్లో దూరిపోయారు కానీ.. ఈ టాస్క్ ప్రేక్షకులకు అంతగా ఎంటర్ టైన్ మెంట్ ను మాత్రం అందించలేదు. ఇవాళ్టి ఎపిసోడ్ లో టాస్క్ కు సంబంధించి మొత్తం కవర్ చేస్తారు. మొత్తానికి అలా 17వ ఎపిసోడ్ పూర్తయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news