Bigg Boss Telugu 3 Episode 20: వరుణ్ కెప్టెన్ గా పనికిరాడన్న బిగ్ బాస్..!

-

20 వ ఎపిసోడ్ లో సిక్రెట్ టాస్క్ ఇవ్వబడిన అలీ, పునర్నవీని వాళ్లకు నచ్చని ఇంటి సభ్యుల గురించి తెలపాలంటూ డాట్ బోర్డులో ఉన్న ఇంటి సభ్యుల ఫోటోలను చూపించి నచ్చని వాళ్ల ముఖంపై బాణం గుచ్చి వాళ్లలో నచ్చని గుణాన్ని బిగ్ బాస్ కు చెప్పాలంటాడు.

ఇంకా బిగ్ బాస్ 80 రోజులు ఉంది. అప్పుడే 20 రోజులను పూర్తి చేసుకున్నది. 15 మంది కంటెస్టెంట్లు 100 రోజుల పాటు ఒకే ఇంట్లో ఉండటం అనేది నిజంగా సహనానికి పరీక్షే. బిగ్ బాస్ అంటే అంతే మరి. బిగ్ బాస్ నియమాలను పాటిస్త 100 రోజుల పాటు ఆ హౌస్ లో ఉండగలిగే వారే బిగ్ బాస్ విజేత. ఈసారి ఆ కిరీటం ఎవరిని వరిస్తుందో చూద్దాం.

ఇక.. 20 వ ఎపిసోడ్ లో సిక్రెట్ టాస్క్ ఇవ్వబడిన అలీ, పునర్నవీని వాళ్లకు నచ్చని ఇంటి సభ్యుల గురించి తెలపాలంటూ డాట్ బోర్డులో ఉన్న ఇంటి సభ్యుల ఫోటోలను చూపించి నచ్చని వాళ్ల ముఖంపై బాణం గుచ్చి వాళ్లలో నచ్చని గుణాన్ని బిగ్ బాస్ కు చెప్పాలంటాడు.

దీంతో పునర్నవి హిమజ, శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ తనకు నచ్చలేదని చెబుతుంది. ఇక.. అలీ మాత్రం మహేశ్ విట్ట, తమన్నా, వితిక తనకు నచ్చలేదని చెబుతాడు.

తర్వత బిగ్ బాస్.. సీక్రెట్ రూమ్ ఇంటి సభ్యులందరికీ రివీల్ చేయడంతో అలీ, పునర్నవి బిగ్ హౌస్ లోకి వచ్చేస్తారు.

కట్ చేస్తే.. బిగ్ బాస్ హౌస్ లో 19 వ రోజు ప్రారంభం అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటి నియమాలను పాటించని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ శిక్ష విధిస్తాడు. అలాగే ఇంటి సభ్యులు ఇంటి నియమాలను పాటించేలా చేయకుండా.. కనీసం తను కూడా పాటించుకుండా నిర్లక్ష్యంగా వహించిన వరుణ్ సందేశ్ కు కూడా బిగ్ బాస్ శిక్ష విధిస్తాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం వరుణ్.. కెప్టెన్ కాలేడని బిగ్ బాస్ చెబుతాడు. అంతే కాదు.. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత కాలం మిగితా ఇంటి సభ్యులకు వరుణ్… సేవ చేయాలని.. డోర్ తీయాలని.. ఫుడ్ సర్వ్ చేయాలని ఆర్డర్ వేస్తాడు. దానికి వరుణ్ సరేనంటాడు. స్మోకింగ్ రూమ్ లో ఒకేసారి ఉన్నవాళ్లు, మైక్ ధరించని వాళ్లు.. బాబా భాస్కర్, శ్రీముఖి, హిమజ, మహేశ్ విట్ట, రాహుల్, తమన్నా, అషు, వితికలను కూడా బిగ్ బాస్ శిక్ష విధించి వాటిని అమలు చేయించాడు. ఆ తర్వాత వాళ్లను క్షమించినట్టుగా బిగ్ బాస్ చెబుతాడు. అంతటితో 19వ ఎపిసోడ్ పూర్తవుతుంది. చూద్దాం.. ఇవాళ శనివారం.. నాగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఎలిమినేషన్ రౌండ్ కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news