Bigg Boss 5 Telugu: “స‌న్నీని అలా పిలువు” .. ష‌న్ను, సిరిల న‌యా ప్లాన్

-

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు 5 షో చివ‌రి ద‌శ చేరుకుంది. కంటెస్టెంట్ల మ‌ధ్య టైటిల్ పోరు హోరా హోరీగా సాగుతోంది. దీంతో గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. కంటెస్టెంట్ల మ‌ధ్య గొడ‌వ‌లు, అల్లర్లతో.. హౌస్ హీటెక్కుతుంటే.. మ‌రోవైపు రొమాన్స్, లవ్ ట్రాకులు, ఎమోషనల్ సన్నివేశాలు చూపిస్తూ.. భారీగా అంచనాలు పెంచుతున్నారు బిగ్ బాస్ టీం. ఇదే స‌మ‌యంలో సినీ, ఇత‌ర ప్ర‌ముఖులు త‌న‌కు న‌చ్చిన కంటెస్టెంట్ల‌కు స‌పోర్టు చేయడంతో షో కు పాపుల‌రీ పెరిగింది. మ‌రోవైపు నెట్టింట్లో టాప్ కంటెస్టెంట్ల మ‌ధ్య ఓ రేంజ్ లో ట్రోలింగ్ వార్ చేస్తున్నారు అభిమానులు.

ఇదిలా ఉంటే.. మంగళవారం జరిగిన ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సన్నీ గురించి షణ్ముఖ్, సిరి మధ్య వాడివేడి చర్చ జరిగింది. స‌న్నీ గేమ్ చెడ్డ గొట్టే విధంగా ఎమోష‌న‌ల్ గేమ్ ఆడ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో స‌న్నీని టార్గెట్ చేస్తూ.. ష‌న్ను, సిరిలు కొత్త వ్యూహాన్ని ర‌చించిన‌ట్టు తెలుస్తోంది.
స‌న్నీ ఇక నుంచి అన్నయ్య అని పిలువుమ‌నీ, ఆ విధంగా చేస్తే.. నిన్ను తిట్ట కుండా, ఎలా ప‌డితే.. అలా మాట్లాడు కుండా ఉంటాడ‌ని సిరికి సలహా ఇచ్చాడు ష‌న్ను. ఈ వ్యూహాన్ని అమ‌లు ప‌ర‌చడానికి సిరి కూడా
గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మొత్తానికి స్ట్రాంగ్ ఫ్లేయ‌ర్ అయిన స‌న్నీని ఎమోషనల్‌గా దెబ్బ‌కొట్టాడానికి కొత్త ప్లాన్ వేసినట్లు కనిపించింది. మ‌రీ ఇద్ద‌రి వ్యూహా ఏ మేర‌కు ప‌నిచేస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version