11 వ రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. దానికి పవర్ గేమ్ అని పేరు పెట్టారు. పవర్ గేమ్ ప్రకారం బజర్ మోగగానే గార్డెన్ ఏరియాలో ఉన్న వజ్రాన్ని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వాళ్లకు ఇంటిపై, ఇంటి సభ్యులపై అధికారం వస్తుంది. వజ్రం పక్కనే ఉన్న కిరీటం పెట్టుకొని రాజులా కుర్చీలో కూర్చొని ఇంటి సభ్యులపై అధికారం చెలాయించవచ్చు.
నిజంగా మొదటి, రెండో సీజన్లలో లేనంత ఆసక్తి మూడో సీజన్ లో క్రియేట్ అయింది. ఈసారి కంటెస్టెంట్లు కూడా చాలా గరంగరంగా ఉన్నారు. అస్సలు తగ్గట్లేదు. దీంతో హౌస్ లో గొడవలే గొడవలు. ప్రేక్షకులు కూడా వాళ్ల గొడవలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బిగ్ బాస్ షో పాపులారిటీ పెరిగిపోతోంది.
ఇప్పటికి 12 ఎపిసోడ్లను బిగ్ బాస్ పూర్తి చేసుకుంది. అంటే 11 రోజులు అయిపోయాయి. ఇంటి సభ్యులు ఇంకా 89 రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండాలి. ఇప్పటికే హేమను వెళ్లగొట్టారు. ఈవారం ఎవరు వెళ్తారో ఆద్యంతం ఆసక్తిగా మారింది.
ఇక… 11 వ రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. దానికి పవర్ గేమ్ అని పేరు పెట్టారు. పవర్ గేమ్ ప్రకారం బజర్ మోగగానే గార్డెన్ ఏరియాలో ఉన్న వజ్రాన్ని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వాళ్లకు ఇంటిపై, ఇంటి సభ్యులపై అధికారం వస్తుంది. వజ్రం పక్కనే ఉన్న కిరీటం పెట్టుకొని రాజులా కుర్చీలో కూర్చొని ఇంటి సభ్యులపై అధికారం చెలాయించవచ్చు.
అయితే.. ముందుగా వరుణ్ సందేశ్ వజ్రాన్ని ముట్టుకొని రాజు అవుతాడు. కాసేపు ఇంటి సభ్యులతో ఓ ఆటాడుకున్నాక… మరోసారి బజర్ మోగుతుంది. ఈసారి అలీ వజ్రాన్ని ముట్టుకుంటాడు. అయితే.. నిజానికి శివజ్యోతికి ఈ వజ్రం దక్కాల్సింది కానీ.. తనను నెట్టేయడంతో కింద పడిపోతుంది. దీంతో వజ్రం అలీ సొంతమవుతుంది. అలీ… మగవాళ్లను ఆడవాళ్లలా… ఆడవాళ్లను మగవాళ్లలా డ్రెస్సులు వేసుకొని పాటలు పాడుతూ రాజును మెప్పించాలంటాడు. జాఫర్, తమన్నా, వరుణ్, వితిక తప్ప.. మిగితా వాళ్లంతా అలీ చెప్పినట్టు చేస్తారు.
ఆ తర్వాత మరోసారి బజర్ మోగుతుంది.. అప్పుడు హిమజ వజ్రాన్ని అందుకుంటుంది. అప్పుడు హిమజ రాణి అవుతుంది. హిమజ రాణి అయ్యాక.. తమన్నా తన జీవితం గురించి చెప్పాలంటూ కోరడంతో తమన్నా తను పడ్డ కష్టాలను ఇంటి సభ్యులను చెబుతుంది.
తర్వాత బిగ్ బాస్ ఇంతటితో పవర్ గేమ్ ముగిసిందని చెబుతాడు. పవర్ గేమ్ లో గెలిచిన వరుణ్, అలీ, హిమజ.. ముగ్గురు మొదటి కెప్టెన్సీ కోసం పోటీ పడుతారని బిగ్ బాస్ చెబుతాడు.
అయితే.. ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ గా ఉండాలో ఇంటి సభ్యులనే నిర్ణయించుకోమంటాడు బిగ్ బాస్. అయితే.. హిమజకు ఒక్క ఓటు కూడా పడకపోవడం… వరుణ్ కు అలీ కన్నా ఎక్కువ ఓట్లు పడటంతో బిగ్ బాస్ 3 లో మొదటి కెప్టెన్ వరుణ్ అవుతాడు. మొదటి కెప్టెన్ వరుణ్ కు బిగ్ బాస్ శుభాకాంక్షలు చెప్పి… కెప్టెన్ విధులను వరుణ్ కు వివరిస్తాడు బిగ్ బాస్. అలా.. 12 వ ఎపిసోడ్ ముగిసిపోతుంది.