ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఫ్రెండ్‌షిప్ డే వచ్చేస్తోంది. దీంతో ఆ రోజున స్నేహితులతో కలిసి ఏం చేయాలా..? అని చాలా మంది ఇప్పటి నుంచే ఆలోచనలు చేస్తున్నారు.
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఫ్రెండ్‌షిప్ డే వచ్చేస్తోంది. దీంతో ఆ రోజున స్నేహితులతో కలిసి ఏం చేయాలా..? అని చాలా మంది ఇప్పటి నుంచే ఆలోచనలు చేస్తున్నారు. ఇక ఆ రోజున ఎలాగూ స్నేహితులందరూ ఒకరికొకరు బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటుంటారు. అయితే గిఫ్ట్స్ విషయానికి వస్తే ఎవరైనా గులాబీ పూలు, పూల బొకేలు, గ్రీటింగ్‌లు ఇచ్చుకుంటుంటారు. కానీ ఇది 21వ శతాబ్దం. ఈ టెక్ యుగంలోనూ పాత తరం బహుమతులు ఇచ్చుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని.. ఈ సారి మీరు మీ ఫ్రెండ్స్‌కు వెరైటీ టెక్ గ్యాడ్జెట్లను బహుమతిగా అందజేయండి. దీంతో వారు చెప్పలేనంత సంతోషంగా ఫీలవుతారు. మరి ఈ ఫ్రెండ్‌షిప్ డే రోజున మీరు మీ ఫ్రెండ్స్ కు ఏయే గ్యాడ్జెట్లను బహుమతులుగా ఇస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఎంఐ బ్యాండ్ 3
స్నేహితుల దినోత్సవం రోజున ఫ్రెండ్స్ ఇచ్చుకునేందుకు చక్కని బహుమతుల్లో ఇదొకటి. ఎందుకంటే ఈ బ్యాండ్ ధర కూడా పెద్దగా ఉండదు. ఇక ఈ బ్యాండ్‌ను ఇస్తే.. మీరు మీ స్నేహితుడి ఆరోగ్యాన్ని పట్టించుకున్న వారవుతారు. వారు ఆ విషయం గ్రహించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఫిట్‌నెస్ ట్రాకర్‌తో ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. దీని ధర రూ.1,999. ఆన్‌లైన్‌లో ఈ బ్యాండ్‌ను కొనుగోలు చేయవచ్చు.
2. పోర్టబుల్ స్పీకర్
మీ ఫ్రెండ్ సంగీత ప్రియుడా..? పాటలంటే ఇష్టమా.. అయితే ఈ పోర్టబుల్ స్పీకర్‌ను ఫ్రెండ్‌షిప్ డే రోజున ప్రజెంట్ చేయండి. వారు ఫిదా అవకపోతే చెప్పండి. జేబీఎల్ కంపెనీ తయారు చేసిన ఈ పోర్టబుల్ స్పీకర్ ధర రూ. 1499 మాత్రమే. దీన్ని కూడా ఆన్‌లైన్‌లో కొనవచ్చు.
3. బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్
మీ ఫ్రెండ్ అస్తమానం చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటుంటాడా..? అయితే ఈ ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను మీరు మీ స్నేహితుడికి గిఫ్ట్‌గా ఇవ్వండి. ఎంతో సంతోషిస్తాడు. దీని ధర రూ. 1499.
4. వైర్‌లెస్ పవర్ బ్యాంక్
మీ స్నేహితుడికి ఫ్రెండ్ షిప్ డే రోజున ఇవ్వదగిన గిఫ్ట్‌లలో ఈ పవర్ బ్యాంక్ కూడా ఒకటి. శాంసంగ్ రూ.3699 ధరకు అందిస్తున్న ఈ వైర్‌లెస్ పవర్ బ్యాంక్‌తో సపోర్ట్ ఉన్న ఫోన్లకు వైర్‌లెస్ గా చార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే వైర్‌తోనూ ఈ పవర్‌బ్యాంక్ ద్వారా ఫోన్లకు చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు మాధ్యమాల్లోనూ విక్రయిస్తున్నారు.
5. డిజిటల్ అలారం క్లాక్
నేడు నడుస్తున్నది పోటీ యుగం. ఈ యుగంలో ఇతరులతో పోటీ పడాలంటే మనం కచ్చితంగా టైం ఫాలో అవ్వాలి. అందుకని మీరు మీ స్నేహితుడు అన్ని పనులూ టైముకు చేసుకునేలా ఓ డిజిటల్ అలారం క్లాక్‌ను ఈ సారి ఫ్రెండ్‌షిప్ డేకు అతనికి గిఫ్ట్‌గా ఇవ్వండి. మీరు మీ స్నేహితుడి కెరీర్ పట్ల చూపించే ఇంట్రెస్ట్‌కు అతను ఫిదా కాకపోతే చెప్పండి..!