బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీ ఎంత‌… ఫైన‌ల్ ట్విస్ట్ ఇదే..!

-

బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. మొదటి రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి ప్రేక్షకాదరణ తగ్గినమాట నిజమే.. కానీ సీజన్ 3 ఫైనల్ ని  గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు నిర్వాహకులు. ఎన్నో ఆశలతో స్టార్ మా ఛానల్ అయిదారు చిన్న సినిమాలకు పెట్టే బడ్జెట్ రేంజ్ లో బిగ్ బాస్ 3 ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. స్టార్ హీరో నాగార్జున హోస్ట్ గా రావడంతో బిగ్ బాస్ 3కు రేటింగ్ లు అదిరిపోతాయి అని అందరూ అంచనా వేశారు. తొలివారం తోనే బిగ్ బాస్ 3 పూర్తిగా చేతులు ఎత్తేసింది. అసలు కంటెస్టెంట్స్‌తోనే చాలా మంది ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు.

తొలి రెండు రోజులతో పోలిస్తే మూడో సీజన్ చాలా చాలా వీక్ అన్న టాక్ వచ్చేసింది. ఇక బిగ్ బాస్ 3 కి వస్తున్న ప్రేక్షకాదరణ ఎలా ఉన్నా ఫైనల్ మాత్రం చాలా గ్రాండ్ గా చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ను అనౌన్స్ చేసి వాళ్లకు బిగ్‌బాస్ ఛాంపియన్ ట్రోఫీ అందించేందుకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జున, చిరంజీవి ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా  హాజరు కావాలని చిరంజీవిని కోరగా చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

క‌నీసం ఫైన‌ల్‌కు అయినా మంచి టీఆర్పీలు సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 3 టైటిల్ విన్నర్ ఎవరో చిరు స్టేజి మీద ప్రకటిస్తారు. గత సీజన్లో నాని హోస్ట్ గా ఉంటే ఫైనల్ కి గెస్ట్ గా వెంకటేష్ వచ్చి కౌశల్ మందా పేరును విజేతగా ప్రకటించారు. మరి ఈ సారి చిరు చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీ తీసుకునే అదృష్టం ఎవరికి ఉందో ?  చూడాలి. ఇక బిగ్ బాస్ 3 సీజన్ విన్నర్ కు ట్రోఫీతో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. ఈ విషయాన్ని బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు నాగార్జున పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news