జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి తరచూ తన వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ పై ఆమె చేసిన విమర్శలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె వుమెన్ సెలబ్రిటీల టార్గెట్గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల షీ టీమ్స్ ఏర్పడి 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సమంత అక్కినేని, మంచు లక్ష్మి, పీవీ సింధు శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. వీటినే ప్రస్తావించిన శ్వేతారెడ్డి, వీరు ముగ్గురూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారేనని వ్యాఖ్యానించారు.
ఈ ముగ్గురు మహిళామణులు బంగారు తెలంగాణలో సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఫీల్ కాకుండా ఏడ్చే పరిస్థితి ఎక్కడుందని అడిగారు. వీరు ముగ్గురూ తప్ప రాజకీయ నాయకులుగానీ, జర్నలిస్టులు గానీ, పోలీసుల్లోని మహిళలుగానీ షీ టీమ్స్ గురించి స్పందించలేదని శ్వేతా రెడ్డి అన్నారు. ఈ ముగ్గురు గురించి శ్వేతా రెడ్డి ప్రస్తావిస్తూ హీరోయిన్ సమంత తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని, కేటీఆర్ నుంచి ఆమెకు అనేక అవకాశాలు వచ్చాయని ఆరోపించారు. ఇక మంచు లక్ష్మి సినిమాలకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయని, ఇక బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలంగాణ ప్రభుత్వం ఎకరాల ఎకరాల భూమి ఇచ్చిందని శ్వేతా రెడ్డి ఆరోపించారు.
ఇక బిగ్ బాస్ షో గురించి తనతో సహా ఎంతోమంది ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించిన శ్వేతారెడ్డి… ఆ షోలో అనైతిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఫిర్యాదు చేసినా, పోలీస్ స్టేషన్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా, షీ డీసీపీలు, షీ సిట్ ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పబ్బులు… క్లబ్బుల చుట్టూ తిరుగుతూ శని, ఆదివారాలు తప్పతాగి రోడ్లపై న్యూసెన్స్ చేస్తూ సమంత మంచు లక్ష్మి లాంటి వాళ్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన కేసులు పెట్టకుండా వదిలేస్తున్నారని శ్వేతా రెడ్డి ఆరోపించారు. తెలంగాణ షీ టీమ్స్ సమంత, లక్ష్మి, పీవీ సింధులకు మాత్రమే రక్షణగా ఉన్నారని, అత్యాచారాలను, మహిళలపై వేధింపులను పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రస్తుత౦ శ్వేతా రెడ్డి వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.