గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్..!

ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలలో కోత విధించింది. ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారికి బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబర్ నెల జీతంలో 10నుండి 50 శాతం వరకు కోత విధించారు. అదే విధంగా సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 22 వరకు హాజరు డాటా ఆధారంగానే ఉద్యోగులకు జీతాలను వేయాల్సి ఉంది.

jagan
jagan

అయితే బయోమెట్రిక్ మెషిన్ లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి అని.. ఆ సమస్యలు పరిష్కరించకుండా జీతాల్లో కోత విధించింది. ఈ నిర్ణయం పై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెరుగైన పనితీరును కనబరిచిన వారికి ట్రైనింగ్ ఇవ్వాలని…అయినా ప్రభుత్వ ప్రమాణాలను అందుకోలేకపోతే వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని ముఖ్యమంత్రి ఇటీవల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.