బాబు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్…!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నడు లేని విధంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద ఎత్తున పదవులను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటన చేసింది. జాతీయ స్థాయి పదవులకు ఎస్సీ ఎస్టీ నేతలను ఎంపిక చేసింది. తెలంగాణా నుంచి ఏపీ నుంచి కూడా ఈ పదవులను ప్రకటించడంతో రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహం తెచ్చే విధంగా కేంద్రం వ్యవహరిస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని కొన్ని తప్పులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకునే అవసరం ఉన్న సమయంలో… యువనేతలు చాలా మందికి పదవులను ప్రకటించలేదు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయ్యన్న పాత్రుడు కుమారుడు, అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అశోక్ గజపతి రాజు కుటుంబానికి ఇలా చాలా మందికి పదవులు ఇవ్వలేదు. వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం దక్కొచ్చు లేకపోవచ్చు. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా పదవులు ప్రకటించడం లో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారు. కర్నూలు జిల్లాలో భూమా కుటుంబాన్ని అసలు పట్టించుకోలేదు.

గుంటూరు జిల్లాలో కూడా యువనేతలను ముందుకు నడిపించలేదు. అమెరికా సహా ఇతర దేశాల నుంచి వచ్చి ఇప్పుడు పార్టీ కోసం పని చేయడానికి వచ్చిన చాలా మందికి పదవులు రాలేదు. ఉద్యోగాలు మానేసి వస్తున్న మీకోసం యాత్రలో తిరిగిన చాలా మందికి పదవులు ఇవ్వలేదు. విజయవాడలో దేవినేని చందు సహా కొంత మందికి పదవులు రాలేదు. అంతే కాదు… ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పదవుల ప్రకటన విషయంలో చంద్రబాబు నాయుడు తప్పులు చేసారు. బలమైన నేతలుగా ఉన్న చింతమనేని ప్రభాకర్, అరిమిల్లి రాధాకృష్ణ వంటి వారిని కూడా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు అధినేత.

ఇలా చాలా మంది నేతలను విస్మరించారు అధినేత. అనంతపురం జిల్లలో మంచి ఇమేజ్ ఉన్న బండారు శ్రావనీ లాంటి వారిని కూడా పట్టించుకోలేదు. జేసి కుటుంబంలో మాత్రం అల్లుడు దీపక్ రెడ్డికి కేవలం అధికార ప్రతినిధి పదవి ప్రకటన చేసారు. ఇవన్ని కూడా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన తప్పులతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. కడప జిల్లాలో బీటెక్ రవి లాంటి వారిని కూడా పట్టించుకోలేదు.