బీజేపీ మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ : హరీష్ రావు

-

బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు విమర్శలు గుప్పించారు . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పేరు గొప్ప ఊరు దిబ్బలాగా వాస్తవాలు మరుగున పడేసి, ఆర్భాటపు ప్రకటనలే పరిమితం అయింది అని విమర్శించారు. మాటల్లో వికసిత్ భారత్ – చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి బీజేపీ నిరూపించింది అని మండిపడ్డారు.మాటల గారడీ తప్ప, చేతల్లో చేసేదేమీ లేదని బిజెపి మేనిఫెస్టో తేల్చిచెప్పింది అని అన్నారు.మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పినా, ఈ నాలుగు వర్గాలను కూడా బీజేపీ విస్మరించింది.

కాగా, లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలో మూడవ సారి అధికారమే లక్ష్యంగా సంకల్ప పత్ర పేరుతో ప్రజాకర్శక మేనిఫెస్టోను విడుదల చేశారు. 14 ప్రధాన హామీలతో రూపొందించిన బీజేపీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ రిలీజ్ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది.

Read more RELATED
Recommended to you

Latest news