బింబిసార, సీతారామం సినిమాల ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ !

-

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్టు 5న) గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బింబిసార అనే రాజుగా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడని టాక్ కూడా వినిపిస్తోంది.

టైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్ తో తిరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ కోసం పలు ఓటిటి సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయట.

చివరకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ జి5 బింబిసారాను భారీ ఒప్పందానికి సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ అనంతరం 8 వారాల తర్వాతే ఓటిటికీ వస్తుందని అంటున్నారు. అంటే ఈ మూవీ అక్టోబర్ లోనే ఓటిటీ లో అందుబాటులోకి రానుందట. అటు సీతారామం సినిమా కూడా మరో 8 నుంచి 10 వారాల్లోనే ఓటీటీలో రిలీజ్‌ కానుందని టాక్‌ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news