హైదరాబాద్ నగరంలో బయో డైవర్శిటీ ఫ్లై ఓవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మూతబడ్డ ఈ ఫ్లైఓవర్ తిరిగి ప్రారంభమైంది. నిపుణుల కమిటీ సూచనలతో ఫ్లైఓవర్ స్పీడ్ కంట్రోల్‌కు అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నాటికి చర్యలు పూర్తి కావడంతో నేటి నుంచి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు. గత నెల 23వ తేదీన వంతెనపై ఓ కారు అదుపు తప్పి పైనుంచి కింద పడిన ఘటనలో సత్యవేణి(56) అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. డ్రైవరు సహా మరో ముగ్గురు గాయపడ్డారు. నాటి నుంచి వంతెనను మూసివేశారు.
ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్‌పై ప్రమాదాలకు కారణాలు, నివారణ చర్యల అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించింది. కమిటీ వంతెనను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. ఇక మళ్లీ ఆ రోజు బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ తిరిగి ప్రారంభమైంది. కాగా, తీవ్ర బయాందోళనకు గురి చేసిన హైదరాబాద్ బయోడైవర్సిటీ పార్క్ ఫ్లైఓవర్ కారు ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. గంటకు 40 కిలోమీటర్ల వేగతంతో వెళితే ఇబ్బందేమి లేదని.. అంతకు మించిన వేగంతో వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సూచించిన విషయం తెలిసిందే.