మనుషుల్లో బర్డ్ ఫ్లూ… మొదటి కేసు వచ్చేసింది…!

-

చైనాలో ఇప్పుడు మరో రోగం బయల్దేరింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్ నుండి హెచ్ 10 ఎన్ 3 బర్డ్ ఫ్లూని మనుషుల్లో గుర్తించారు. చైనాలో ఇది బయటపడినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ మంగళవారం తెలిపింది. జెంజియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల రోగికి ఈ వ్యాధి సోకింది. అతనికి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేసింది. ఈ కేసు పౌల్ట్రీ నుండి మానవులకు అప్పుడప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుందని…

ఇది వ్యాపించే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. రోగికి మే 28 న హెచ్ 10 ఎన్ 3 ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వస్తుందా అనే దానిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news