తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం !

-

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా కొత్త పల్లె మండలం సింగరాజుపల్లెలో కొళ్లు మృత్యువాత పడడం టెన్షన్ రేపుతింది. సింగరాజుపల్లె  రామాలయం వీధిలో నాలుగు రోజుల్లో 50 నాటుకోళ్లు మృతి చెందాయి. దీంతో బర్డ్ ఫ్లూ ఏమోనని భయపడి ఊరి బయట పడేశారు స్ధానికులు. అంతే కాక పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపధ్యంలో వారు వచ్చి శాంపిల్స్ తీసుకుని వెళ్ళారు.

ఇక అలానే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా గ్రామంలో చంద్రకళ అనే మహిళ ఇంట్లో 50 కి పైగా నాటు కోళ్లు చని పోయాయి. బర్డ్ ఫ్లూ వలన చనిపోయి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అయితే అదేమీ లేదని యూరియా తిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. అధికారులు కూడా అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. శాంపిల్స్ ని పరీక్షలకు పంపామని అక్కడి నుండి వివరాలు వస్తేకానీ ఏమీ చెప్పలేమని అంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news