బర్తడే స్పెషల్ : బాలయ్య బాబు కు తీరని కోరిక.. ఏమిటో తెలుసా..?

-

నందమూరి బాలకృష్ణ.. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య బాబు కు సంబంధించి కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ హంట్ టీజర్ పేరిట ఒక ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. అయితే ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం. ఎవరూ ఊహించని విధంగా ఈ టీజర్ కి 3.5 మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఊర మాస్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతోందని ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి. ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన బాలయ్యకు ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదట.Buzz: Balakrishna in Rajamouli's Next?

సుల్తాన్ తో పాటు మరెన్నో సినిమాలలో నెగటివ్ పాత్రలు పోషించిన బాలకృష్ణ .. పూర్తిస్థాయిలో ఒక భారీ సినిమాలో విలన్ గా నటించాలనే కోరిక ఉందట. ఇక విలనిజంతో ప్రేక్షకులను అలరించాలనే కోరిక బాలయ్యకు ఎప్పటినుంచో ఉందట. కానీ ఆ కోరిక ఇప్పటివరకు నెరవేరకపోవడం గమనార్హం. ఎంతోమంది దర్శకులను కూడా సంప్రదించి తనకోసం ఒక ప్రత్యేకమైన విలన్ పాత్రను తయారు చేయమని చెప్పిమా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఒకవేళ కథ నచ్చితే మల్టీస్టారర్ మూవీ చేయడానికి కూడా బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటట్లు ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆయనకు ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర కావాలట మరి బాలకృష్ణ కోరిక తీర్చే దర్శకుడు ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news