నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన చిన్నారి శాస్త్ర చికిత్సకు సోనూసూద్ సాయం

-

చాలా మంది పిల్లలు జన్యులోపం కారణంగానో లేక మరే ఇతర కారణాల వల్లనో శరీరంలో ఏదో ఒక అవయవం గాని,లేదా నడుం భాగం నుంచి అతుక్కుని పుట్టిన వాళ్ళని చూశాం.కానీ ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం చాలా విచిత్రంగా జన్మించింది.బీహార్ లోని నెవాడా జిల్లాకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించింది. ఆ చిన్నారి కుటుంబం వైద్యం చేయించే స్తోమత లేని పేద కుటుంబం.

అయితే ఆ చిన్నారికి చేతులు, కాళ్ళు ఆమె పొట్ట భాగానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ మేరకు ఆ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూసూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అంతే కాదు ఆ చిన్నారికి వైద్యం అందుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news