బిర్యానీ బుక్ చేసి 50 వేలు పోగొట్టుకున్నాడు…!

-

200 రిఫండ్ కోసం ఒక టెకీ ఏకంగా 50 వేలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని జుబ్లీహిల్స్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే రెండ్రోజుల క్రితం జూబిలీహిల్స్ సమీపంలోని రహ్మత్ నగర్‌కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, జుమాటో యాప్‌లో చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. తాను బిర్యాని ఆర్డర్ చేస్తే సాంబార్ రైస్ వచ్చింది. జుమాటో కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్ లో వెతికాడు.

ఒక నెంబర్ కనపడటంతో దానికి కాల్ చేసి వివరించాడు. అయితే ఇక్కడ అతనుఒక తప్పు చేసాడు. అతను చేసిన నంబర్ ఫిషింగ్ పేజీలోది. ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఈ విషయాన్ని అంతా విన్న సైబర్ నేరగాళ్ళు రిఫండ్ ఇస్తామని నమ్మించారు. పేటీఎం నంబర్ ఉందని తెలుసుకుని తమ సూచనలు పాటించాలని సూచించారు. పేటీఎం వివరాలు తీసుకున్న అనంతరం, ‘‘రీఫండ్ ప్రోసెస్’’ అని చెప్పారు.

‘‘ప్రొసీడ్ టు పే’’ అనే సందేశం వచ్చిన తర్వాత, తనకు డబ్బులు వస్తాయేమోనన్న ఆశతో వాళ్లు చెప్పినట్టే చేయగా మూడు సార్లు చేయగా అది ఎర్రర్ అని వచ్చింది. అంతా అయిన తర్వాత తన ఖాతాలో రూ.50 వేలు పోగొట్టుకున్న విషయం గుర్తించాడు. ఈ ఘటనపై ఐపీసీ 420తో పాటు ఐటీ చట్టం 66సీ, 66డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news