తెలంగాణ రాష్ట్రంలో రకరకాల సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన టిఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నేలపోగుల గ్రామ అధ్యక్షుడు కందగట్ల భాస్కర్ ని సైబర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆ నేత చేసిన పని కెసిఆర్ కి పిచ్చ కోపం తెప్పించడం తో వెంటనే పోలీసుల చేత అతన్ని అరెస్టు చేయించినట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్. మేటర్ లోకి వెళ్తే యువతులతో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడడం మరి అదేవిధంగా అసభ్యకర చిత్రాలు వీడియోలు వాట్సాప్ లో పంపించడంతో అతనిపై ఫిర్యాదు నమోదైంది.
టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా కందగట్ల భాస్కర్ వ్యవహరించిన తీరు ఆ గ్రామంలో మరియు జనగం జిల్లాలో వైరల్ కావడంతో ఇతని పై ముందునుండే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ప్రజల్లో నెలకొంది. కాగా ప్రభుత్వం ఇచ్చే రుణాల కోసం యువతులు బీసీ కార్పొరేషన్ ఆఫీస్ కి వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్న అధికారులను గుప్పెట్లో పెట్టుకున్న ఈ టీఆర్ఎస్ నేత దరఖాస్తు చేసే యువతులు ఫోన్ నెంబర్లు ఫోటోలు అడ్రస్ సేకరించి వేధింపులకు పాల్పడడం తో ఈ విషయం బయటకు రావడంతో అతనిపై కేసు నమోదైంది.
అయితే ఈ విషయం టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే అతన్ని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో అతనిపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని అతనికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 2000 జరిమానా కూడా విధించారు. దీంతో సొంత పార్టీకి చెందిన నాయకుడు తప్పుచేస్తే కేసీఆర్ ఈ విధంగా చర్యలు తీసుకోవటంతో ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయింది.