పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ..!

-

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి క్లారిటీ ఇచ్చారు. అనంతపురం పర్యటనలో ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానం అన్నారు డీజీపీ. మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం. రాజకీయ ఒత్తిళ్లతో మేము పని చేయబోమని స్పష్టం చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్ చేయను అంటూ దాటవేశారు.

వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసును అయినా విచారణ చేపడుతామన్నారు డీజీపీ. టీడీపీ కార్యాలయం పై దాడి జరిగితే.. కేసు పెట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిందితులను అరెస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు డీజీపీ ద్వారకా తిరుమల రావు. గతంలో నేరస్తులను పట్టుకునేందుకు ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీ ఉన్నా ఉపయోగించుకోలేదని విమర్శించారు. మాజీ సీఐడీ చీఫ్ సంజయ్ నిధుల దుర్వినియోగం పై విచారణ జరుగుతుందన్నారు. డీజీపీ ఆఫీస్ లో సంతకాలు చేస్తున్న వారిలో 10 మంది ఐపీఎస్ అధికారులక పోస్టింగ్ ఇచ్చాం. మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ.

Read more RELATED
Recommended to you

Latest news