బిజినెస్ ఐడియా: ఈ వ్యాపారాలతో ఎక్కువ లాభాలు..పెట్టుబడి తక్కువే..!

-

మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారా..? ఏ వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. ఈ బిజినెస్ ఐడియాస్ ను కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచి రాబడి వస్తుంది. పైగా ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు. మరి ఆ బిజినెస్ ఐడియాస్ గురించి చూద్దాం.

అప్పడాల వ్యాపారం:

అప్పడాల వ్యాపారానికి ఎక్కువ ఖర్చు అక్కర్లేదు. తక్కువ పెట్టుబడి తో మీరు ఎక్కువ రాబడిని పొందవచ్చు. చాలా రకాల ఫ్లేవర్స్ తో అప్పడాలు అమ్ముతూ ఉంటారు. మినప, బియ్యం, పెసర, బంగాళదుంప ఇలా మీకు నచ్చిన అప్పడాలని మీరు మొదలు పెట్టి వ్యాపారం చేయొచ్చు. ఈ వ్యాపారానికి 25000 కంటే తక్కువ అవుతాయి. అలానే మంచిగా రాబడి కూడా పొందొచ్చు.

మసాలా దినుసులు వ్యాపారం:

భారతదేశం అంతటా కూడా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. గరం మసాలా, జీరా మసాలా ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు మొదలు పెట్టొచ్చు. చక్కగా ఈ వ్యాపారం తో మంచిగా రాబడి వస్తుంది.

బిస్కెట్ల వ్యాపారం:

బిస్కెట్లు వ్యాపారంతో కూడా మంచిగా రాబడి వస్తుంది. బేకరీ ప్రొడక్ట్స్ ని కూడా మీరు అమ్మొచ్చు. ఇలా కేకులు, బిస్కెట్లు, చిప్స్ వంటివి మీరు అమ్మి మంచిగా రాబడి పొందొచ్చు. దీనికి కూడా రిస్క్ ఏమి ఉండదు. అలానే ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువే.

ఆర్టిఫిషియల్ జువెలరీ:

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా డబ్బులుని వీటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ వ్యాపారంతో మీరు నెలకి 15వేల నుంచి 20వేల వరకు సంపాదించుకోవచ్చు. అలానే పెట్టుబడి కూడా తక్కువే ఇలా ఈ విధంగా మీరు అనుసరిస్తే మంచి రాబడి పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news